ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: పెండింగ్ డీఏలు, పీఆర్సీపై సీఎం కీలక నిర్ణయం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

అమరావతిలో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకరించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను అక్టోబర్ నుంచి చెల్లించాలని నిర్ణయించారు. సంక్రాంతికి సరెండర్ లీవ్ నగదు, పోలీసులకు దసరా కానుకగా అదనపు లీవ్ ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల భారం పడనుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారికి అండగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు.