రాజమహేంద్రవరంలో కారులో ఉన్న రెండు కోట్ల నగదుతో డ్రైవర్ పరారీ

రిపోర్టర్: సురేష్ స్థలం: రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరంలో కేబీకే బయోటెక్‌ పరిశ్రమ లావాదేవీలకు సంబంధించిన రూ.2 కోట్ల నగదుతో కారు డ్రైవర్ పరారైన ఘటన సోమవారం కలకలం రేపింది. ఆర్వీనగర్‌కు చెందిన కందుల సురేష్‌కుమార్ తన కారులో రెండు కోట్ల నగదును ఉంచి దానవాయిపేటలోని జిమ్‌కు వెళ్లగా, అదే సమయంలో డ్రైవర్ పండూరి సాయిశివ కారుతో సహా నగదును అపహరించుకెళ్లాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.