మహారాజా చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా సచన నామిదాస్ అవార్డు స్వీకరణ
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
మహారాజా చిత్రంలో నటనకు గాను 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో సచన నామిదాస్ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. తన కుటుంబ కష్టాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఈ పురస్కారాన్ని ఎంతో భావోద్వేగంగా స్వీకరించారు. తమిళ సంప్రదాయాలు, కళా వైభవాన్ని చాటేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంప్రదాయ దుస్తులలో ఆమె ఈ వేడుకకు హాజరై అందరినీ ఆకట్టుకున్నారు.