ఖాతాదారులపై సేవా ఛార్జీల బాదుడు పెంచిన యాక్సిస్ బ్యాంక్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు కీలక సమాచారం. 2026 డిసెంబర్ 1 నుంచి పొదుపు, ఎన్ఆర్ఐ ఖాతాలకు సంబంధించిన సేవా ఛార్జీలను బ్యాంక్ సవరించనుంది. ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను నెలకు నాలుగు నుంచి మూడుకి తగ్గించడంతో పాటు, కనీస నిల్వలు నిర్వహించని ఖాతాలపై జరిమానాను గరిష్ఠంగా రూ.600కు పెంచనుంది. చెక్ బౌన్స్ లేదా రిటర్న్ ఛార్జీని రూ.200గా నిర్ణయించింది.