తుఫాన్ దెబ్బకు కోస్తాంధ్ర జిల్లాల్లో బడులకు వరుసగా సెలవులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర మరియు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో సెలవులు అమల్లో ఉంటాయని సమాచారం అందుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.