టపాకాయ దుకాణాల ఏర్పాటు: బేల మండల ప్రజల నుంచి ప్రత్యేక స్థలాల విజ్ఞప్తి

రిపోర్టర్: గోపి స్థలం: బేల

దీపావళి పండుగ సందర్భంగా బేల మండల కేంద్రంలో టపాకాయ దుకాణాలను ప్రధాన రహదారులపై కాకుండా ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేయాలని మండల ప్రజలు అధికారులను కోరారు. రద్దీ ప్రాంతాల్ లో దుకాణాల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాల ముప్పు పొంచి ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి అనువైన స్థలాన్ని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.