కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం: జంతర్‌మంతర్‌లో నిరసనలకు పూర్తిగా అనుమతి నిరాకరణ
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
చరిత్రాత్మక ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌పై కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనల సెగ తగలకుండా ఉండేందుకే ఈ ప్రాంతాన్ని నిరసనల జాబితా నుంచి తొలగించినట్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదాన్, బురాఠీ మైదాన్, సీబీడీ గ్రౌండ్స్‌ను నిరసనల కోసం ఎంపిక చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కఠిన నిబంధనపై ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.