ఇది క్రికెట్ కాదు కేవలం బ్యాటింగ్: గౌహతి పిచ్పై గౌతమ్ గంభీర్ అసంతృప్తి
రిపోర్టర్: శివ
స్థలం: గౌహతి
గౌహతి వేదికగా వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఉపయోగించిన పిచ్ తీరుపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాట్, బంతికి మధ్య సరైన పోటీ లేకపోవడంపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు. అభిమానులు చూసింది క్రికెట్ కాదని, కేవలం బ్యాటింగ్ మాత్రమే అని అభివర్ణించారు. బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండే విధంగా పిచ్లను తయారు చేయాలని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు.