ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైల్వే ప్రాజెక్టు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దేశంలోని ప్రధాన మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 962.50 కిలోమీటర్ల మేర హావ్డా-చెన్నై మార్గాన్ని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరకు రవాణా నిరంతరాయంగా సాగేందుకు, మరిన్ని ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు అవకాశం కలుగుతుందని, తద్వారా రాకపోకలు మరింత సులభతరమవుతాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి.