కత్తెరపల్లె హెచ్ఎంకు అరుదైన గౌరవం.. జిల్లా ఉత్తమ అవార్డు!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కార్వేటినగరం
చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గురుపూజోత్సవంలో కత్తెరపల్లె పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. చెంగల్ రాజు జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి ప్రభుత్వం ఈ గుర్తింపునిచ్చిందని ఆయన తెలిపారు.
ఈ అవార్డు తన ఒక్కరి కృషి ఫలితం కాదని, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ, తల్లిదండ్రులు, గ్రామస్తుల సమష్టి సహకారం వల్లే సాధ్యమైందని చెంగల్ రాజు పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో పాఠశాలను మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.