ఏఎన్‌యూ స్వర్ణోత్సవ ప్రస్థానం అద్వితీయం: గవర్నర్ అబ్దుల్ నజీర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ స్వర్ణోత్సవ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధనలు సమకాలీన సవాళ్లను పరిష్కరించేలా ఉండాలని ఆకాంక్షించారు. వర్సిటీ దేశానికి అనేకమంది ప్రముఖులను అందించిందని కొనియాడారు.