వినుకొండ మున్సిపల్ ఎన్నికలపై సిపిఐ ప్రకటన: పది స్థానాల్లో పోటీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: పల్నాడు

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వినుకొండలో వామపక్షాల ఆధ్వర్యంలో చైర్మన్ స్థానంతో పాటు పది కౌన్సిల్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ వెల్లడించారు. వినుకొండ శివయ్య భవన్లో జరిగిన పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ధన ప్రవాహ రాజకీయాలకు భిన్నంగా పేదలకు అండగా నిలిచే తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.