మద్యం కుంభకోణం కేసు: ఈడీ విచారణకు హాజరైన విశ్రాంత ఐఏఎస్ రజత్ భార్గవ
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం సరఫరా ఆర్డర్ల జారీలో జరిగిన అక్రమాలు, లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణపై అధికారులు వివరాలు రాబట్టారు. నాటి సీఎంవో కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగినట్లు గతంలో ఏసీబీ కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది.