హనుమకొండ వేయిస్తంభాల గుడిలో ఘనంగా ఉత్తిష్ఠ గణపతి లక్ష పుష్పార్చన
రిపోర్టర్: సతీష్
స్థలం: హనుమకొండ
హనుమకొండ చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజు వైభవంగా కొనసాగాయి. ఉత్తిష్ఠ గణపతికి కాకతీయుల కాలం నాటి ప్రాచీన కోనేరు తీర్థ బిందాభిషేకం, గందోధికాభిషేకం నిర్వహించి సర్ప గణపతిగా అలంకరించారు. అమరావతి నుంచి తెప్పించిన మల్లె, గులాబీలు, చామంతులతో లక్ష గణపతి నామాలతో లక్ష పుష్పార్చన జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.