ఎం పైపల్లెలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన సునీల్ కుమార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎం పైపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి కె పద్మను భారీ మెజారిటీతో గెలిపించాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికీ తిరిగి అభ్యర్థించారు.