భారత దేశంలో పదేళ్ల అభివృద్ధిపై పోలాండ్ మహిళ ప్రశంసలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
భారత దేశంలో గత పదేళ్లలో వచ్చిన పెను మార్పులను వివరిస్తూ పోలాండ్ దేశానికి చెందిన డొమినికా పటాలాస్ కల్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. డిజిటల్ చెల్లింపులు, మెరుగైన విమానాశ్రయాలు, రవాణా వ్యవస్థ, వేగవంతమైన హోం డెలివరీ సేవలతో పాటు రైల్వే రంగంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించిందని ఆమె కొనియాడారు. ఈ మార్పులను తాను ప్రత్యక్షంగా చూశానని వెల్లడించారు.