బాన్సువాడలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర
రిపోర్టర్: సునీల్
స్థలం: బాన్సువాడ
బాన్సువాడ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలో పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చావడి నుండి కల్కి చెరువు కట్ట వరకు నిమజ్జన రూటును పరిశీలించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో చర్చించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి డీజేలు ఏర్పాటు చేయరాదని, భక్తులు పోలీసులకు సహకరించి శాంతిభద్రతలను కాపాడాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.