గూఢచర్యంలో అమెరికాదే పైచేయి: చైనా, రష్యా నిఘాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: Washington
చైనా, రష్యా దేశాల నిఘాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గూఢచర్యంలో అమెరికాదే పైచేయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశాలు తమపై నిఘా పెట్టినట్లే అమెరికా కూడా వాటిపై నిఘా ఉంచుతోందని అయోవాలో జరిగిన ప్రచార సభలో ఆయన తెలిపారు. అమెరికా భద్రతా వ్యవస్థపై చైనా నిఘా ఆరోపణలు పెరుగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.