డీజేలకు దూరంగా ఒగ్గు డోళ్లతో గణనాథుడి శోభాయాత్ర నిర్వహణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అక్బర్ పేట-భూంపల్లి
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిశాయి. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు స్వగ్రామమైన ఇక్కడ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. డీజేల వల్ల జరిగే ప్రమాదాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు సంప్రదాయ ఒగ్గు డోళ్ల వాయిద్యాలతో ఊరేగింపు చేపట్టి యువత ఆదర్శంగా నిలిచారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు విశేషంగా పాల్గొనగా, అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.