వినాయక చవితి పర్వదినాన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జేబీ శ్రీనివాస్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో అన్ని ఆటంకాలు తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయక వేడుకలను జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.