పింఛన్ల పంపిణీపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకే పంపిణీ చేయాలని, కొత్త వారిని చేర్చకూడదని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.