'ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్‌ వాహనాలు అందుబాటులోకి': డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

నేర ఘటనా స్థలాల నుంచి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో 26 కొత్త ఫోరెన్సిక్‌ మొబైల్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ విభాగాధిపతి రవిశంకర్‌ అయ్యన్నార్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.