ముంబై ఐఐటీ విద్యార్థి సాహిిల్ వాకోడే మృతిలో కుల వివక్ష కోణం లేదన్న విద్యార్థులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ముంబై

ముంబై ఐఐటీ విద్యార్థి సాహిల్ వాకోడే మృతికి కుల వివక్ష కారణమంటూ ఆయన తండ్రి రవీంద్ర వాకోడే చేసిన ఆరోపణలను కొందరు విద్యార్థులు తోసిపుచ్చారు. అకాడమిక్ ఒత్తిడి, కఠినమైన సిలబస్ వల్లే సాహిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వారు తెలిపారు. ప్రొఫెసర్ల వేధింపులంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూనే, కుల కోణాన్ని ముడిపెట్టడం సరికాదని విద్యార్థులు స్పష్టం చేశారు.