మొయినాబాద్ లో కలకలం: అనుమానాస్పద మృతితో వారం రోజుల తర్వాత వెలికితీసిన శవం

రిపోర్టర్: హరి స్థలం: రంగారెడ్డి

కుమారుడి మృతిపై తండ్రి రాజు వ్యక్తం చేసిన అనుమానాలతో మొయినాబాద్ మండలం మేడిపల్లిలో వారం రోజుల క్రితం ఖననం చేసిన ప్రశాంత్ మృతదేహాన్ని మంగళవారం పోలీసులు వెలికితీశారు. పాము కాటుతో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు నిర్వహించగా, అసలు ఉద్యోగమే చేయని విషయం తెలిసి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తహసీల్దార్ గౌతమ్ కుమార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెంకన్న వెల్లడించారు.