ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరుతున్న పేదల సొంతింటి కల

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకం తీసుకువచ్చిందని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక 7వ వార్డు లబ్ధిదారులు సహినా బేగం-సలీమ్ ల ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.