ఎన్నికల ట్రైబ్యునల్ను ఆశ్రయించండి: నామినేషన్ల వ్యాజ్యాలను కొట్టేసిన హైకోర్టు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి వెల్లడించారు. నామినేషన్ల తిరస్కరణపై అభ్యంతరం ఉంటే ఎన్నికల ట్రైబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు బుధవారం సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ఇరువైపులా వాదనలను విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.