గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి G Kishan Reddy ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోవాలోని మైనింగ్ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. మైనింగ్ రంగంలో సరికొత్త అవకాశాల అన్వేషణపై ఇరువర్గాలు చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.