దర్శకుడిగా వెండితెరపైకి అడుగుపెడుతున్న స్టార్ హీరో విజయ్ కుమారుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. సుందీప్ కిషన్ ప్రధాన పాత్రలో సిగ్మా సినిమాతో ఆయన తన కెరీర్ ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తన కుమారుడి కెరీర్ ఎంపికలపై గతంలోనే స్పందించిన విజయ్, జేసన్ సంజయ్ తన నిర్ణయాలను స్వయంగా తీసుకుంటారని, దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ కథ చెప్పినప్పటికీ తనకంటూ సొంత ఆలోచనలతో ఈ రంగాన్ని ఎంచుకున్నారని స్పష్టం చేశారు.