డబ్బు లేకే ఎన్నికల్లో ఓడిపోయామంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: గుంటూరు

డబ్బు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఎన్నికలు ఆర్గానిక్గా జరుగుతాయని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుపేద అభ్యర్థిని గెలిపించాలని ఆర్యవైశ్యులను కోరారు. బెదిరింపులకు భయపడకుండా శక్తినంతా ఉపయోగించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.