'సత్యవేడులో పేకాట స్థావరంపై దాడి': ముగ్గురు అరెస్ట్, వాహనాలు స్వాధీనం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Sathyavedu, Tirupati District

తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని పుదుకుప్పం వద్ద పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సత్యవేడు పోలీస్ స్టేషన్ వర్గాలు వెల్లడించాయి. నిందితుల నుంచి రూ. 6,000 నగదుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.