పెట్టుబడులకు పూర్తి భరోసా: ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
రిపోర్టర్: మహేష్
స్థలం: ఢిల్లీ
పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని, ప్రతి పెట్టుబడికి తనదే భరోసాని ఇస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.