ఎల్నినో విపత్తులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమిటని నిలదీత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
ఎల్నినో విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమిటని మంత్రి భట్టి విక్రమార్క నిలదీశారు. జాతీయ విపత్తు కింద తెలంగాణకు కేంద్రం ఏం సహకారం అందిస్తుందో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల్లో కేంద్రం నుండి నిధులు తెచ్చేలా ప్రయత్నించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.