అలంపూర్ చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: జోగులాంబ గద్వాల్
జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామానికి చెందిన విశ్వం రాజు(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై కర్నూలు వైపు వెళ్తుండగా అలంపూర్ చౌరస్తా సమీపంలో మరో వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.