తెలుగు ప్రేక్షకులకు సినిమా కూడా ప్రాథమిక అవసరమే: నటుడు ఉపేంద్ర లిమాయె

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

తెలుగు ప్రేక్షకులకు సినిమా కూడా ఒక ప్రాథమిక అవసరమని, అందరూ థియేటర్లలో బా బా బ్లాక్ షీప్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయె కోరారు. చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ తొమ్మిదో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.