ప్రజా విముక్తి పోరాట స్ఫూర్తితో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తాండూర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని తాండూర్ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రామగౌని మహిధర్ గౌడ్, చిలుములు శ్రీకృష్ణదేవరాయలు, పులగం తిరుపతి, సిద్ధం మల్లేష్ పాల్గొన్నారు.