బిహార్‌లో బాలికపై వేధింపుల ఘటన, ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు గాయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: బిహార్

బిహార్‌లోని జముయిలో బాలికపై వేధింపులకు పాల్పడిన ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడు. సెప్టెంబర్ 19న కోచింగ్ నుంచి వస్తున్న బాలుడు, బాలికలను దుండగులు అడ్డుకుని లైంగిక దాడికి పాల్పడగా, ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సిట్ ఏర్పాటు చేసి ఏడుగురిని నిందితులుగా గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ పారిపోయేందుకు యత్నించగా పోలీసులు కాలిపై కాల్పులు జరిపారు.