హైదరాబాద్ నుంచి తాష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైనట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ సీఈఓ కధీర్ కధీరవన్ తెలిపారు. దక్షిణ భారతదేశాన్ని మధ్య ఆసియాతో కలుపుతూ తొలిసారిగా డైరెక్ట్ విమాన కనెక్టివిటీ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. సెంట్రమ్ ఎయిర్ సంస్థ ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ విమానాలు వారానికి రెండు సార్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయని అధికారులు వెల్లడించారు. తాష్కెంట్ను కొత్త గమ్యస్థానంగా చేర్చడంతో హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కు చేరిందని అధికారులు స్పష్టం చేశారు.