చుంచుపల్లిలో కుక్కలు, కోతుల దాడులతో ప్రజలు బెంబేలు

రిపోర్టర్: మహేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్, గౌతమ్‌పూర్, ధన్‌బాద్ పంచాయతీల్లో వీధికుక్కలు, కోతుల బెడద తీవ్రమైంది. కేవలం 30 రోజుల్లోనే 60కి పైగా కుక్కకాటు, కోతికాటు కేసులు నమోదయ్యాయి. చిన్నారులు, వృద్ధులపై దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించకుంటే గ్రామసభలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.