అల్లూరి జిల్లాకు రూ.251.90 కోట్ల SASCI నిధులు విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎస్ఏఎస్సీఐ కింద అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.251.90 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో విద్య, వైద్యం, రహదారి కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను బలోపేతం చేసి మన్యం ప్రాంత ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు.