వైశాఖలో ఘనంగా జాతీయ స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

దేశానికి మరింత ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్స్ కావాలని ఒడిశా మాజీ గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆకాంక్షించారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో నాలుగో జాతీయ స్థాయి పాఠశాలల అండర్ పన్నెండు మరియు అండర్ పద్దెనిమిది చదరంగం పోటీలను ఆంధ్రా చెస్ సంఘం అధ్యక్షుడు సురేశ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్ లో దేశవ్యాప్తంగా యాభై పాఠశాలలకు చెందిన రెండు వందల మంది క్రీడాకారులు జట్లుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు.