టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఏపీ టెట్-2026లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మరియు ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అభ్యర్థుల అంకితభావం రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్హత సాధించని వారు నిరుత్సాహపడకుండా తర్వాతి పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.