ఐసీసీ నూతన డిప్యూటీ చైర్మన్‌గా తవెంగ్వా ముకుహ్లాని నియామకం
రిపోర్టర్: సతీష్
స్థలం: World
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన డిప్యూటీ చైర్మన్‌గా జింబాబ్వే క్రికెట్ బోర్డు అధిపతి తవెంగ్వా ముకుహ్లాని నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన 2027 నవంబర్ వరకు కొనసాగునున్నారు. సింగపూర్ దేశానికి చెందిన ఇమ్రాన్ ఖ్వాజా స్థానంలో ముకుహ్లాని ఈ బాధ్యతలు చేపట్టగా, జింబాబ్వే దేశం నుంచి ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన చారిత్రక రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ జై షా ఆయన నియామకాన్ని స్వాగతించారు.