కళ్యాణదుర్గంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

రిపోర్టర్: మహేష్ స్థలం: అనంతపురం

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘అమిలినేని విద్యాచక్రం’ పథకంలో భాగంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. ఎస్సార్సీ సంస్థ సహకారంతో రూ.5 కోట్ల వ్యయంతో 7,300 సైకిళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ప్రయాణ కష్టాలను తగ్గించడమే తమ లక్ష్యమని, పాఠశాలల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.