కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే జయకృష్ణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగరపంచాయితీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన స్థానిక ఓటర్లను అభ్యర్థించారు.