మంచిర్యాలలో విషాదం: కుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల ప్రాంతంలోని ఇందారం గ్రామ సమీపంలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఉపాధి కోసం వలస వెళ్లిన మోటం మనీయమ్మ, మోటం కీర్తన, మాదేని కావ్య కుంటలో శవాలుగా తేలడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చీకటి పడినా రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.