ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసిన సర్కార్
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. మున్సిపల్ పరిపాలన శాఖ ఇందుకు సంబంధించి జీవో నంబర్ 252ను విడుదల చేసినట్లు ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం పదిహేడు కార్పొరేషన్లలో వివిధ వర్గాలకు పదవులు కేటాయించడంతో స్థానిక ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నిర్ణయంతో ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు.