అమెరికాలో విక్రయానికి వచ్చిన ప్రముఖ బేస్‌బాల్ ఆటగాడు డేవిడ్ ఆర్టిజ్ లగ్జరీ భవనం

రిపోర్టర్: అశోక్ స్థలం: World

అమెరికాలోని మయామి సమీపంలో ఉన్న ప్రఖ్యాత మాజీ మేజర్ లీగ్ బేస్‌బాల్ స్టార్ డేవిడ్ ఆర్టిజ్ లగ్జరీ భవనం మరోసారి రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి వచ్చింది. ఫ్లోరిడాలోని పైన్‌క్రాస్ట్ ప్రాంతంలో సుమారు 10,178 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు బెడ్‌రూమ్‌లు, ఎనిమిది బాత్‌రూమ్‌లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ విలాసవంతమైన విల్లాను ప్రస్తుతం 11.5 మిలియన్ డాలర్ల ధరకు విక్రయానికి ఉంచినట్లు సమాచారం వెలువడింది.