స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకే జగన్ కుట్రలు: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
బీసీలకు రాజ్యాధికారం దక్కడం వైకాపా అధినేత జగన్ కు ఇష్టం లేదని, అందుకే స్థానిక ఎన్నికల్ని అడ్డుకోవడానికి ఆయన కుట్రలు పన్నుతున్నారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్ లో బీసీలకు కూటమి పక్షాలు యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాయని ఆయన స్పష్టం చేశారు. వెనకబడిన తరగతులకు తాము కేవలం హామీలివ్వడం లేదని, చేతల్ లో చేసి చూపుతున్నామని మంత్రి సత్యప్రసాద్ తేల్చిచెప్పారు.