పీఏసీఎస్లలో వేల కోట్ల నిధుల స్వాహా: డిపాజిట్లు ఇవ్వక రైతుల ఆవేదన

రిపోర్టర్: విజయ్ స్థలం: ఏలూరు

రాష్ట్రంలోని కొన్ని వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నేతలు, అధికారులు కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బినామీ పేర్లతో రుణాలు తీసుకుని ఎగవేయడంతో, డిపాజిట్లు చేసిన రైతులకు గడువు తీరినా సొమ్ము చెల్లించని దుస్థితి నెలకొందని బాధితులు తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో రైతులు వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.