ఏపీలో చంద్రబాబు, జేపీ నడ్డా కీలక భేటీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉండవల్లిలో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం విజయవాడలో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నడ్డా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.